హీరోయిన్‌గా రానున్న మరో యాంకర్
- January 06, 2017
బుల్లి తెరపై వివిధ ప్రోగ్రాంలకు యాంకర్లుగా పని చేస్తున్నవారు ఈ మధ్య సినిమా హీరోయిన్లుగా అదరగొడుతున్నారు. అవకాశం ఇవ్వాలే కాని తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రెష్మిగౌతమ్ ఈ కోవలోకే వస్తారు. మొదట యాంకర్లుగా ఉన్న వీరు, 'సోగ్గాడే చిన్నినాయనా'తో అనసూయ, గుంటూరు టాకీసుతో రష్మి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే రెష్మి కొంత వరకు సక్సెస్ అవగా, అనసూయకు మాత్రం కలిసి రాలేదు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా తన అంద చందాలతో కుర్రకారును చిర్రెత్తించిన రెష్మి తర్వాత కూడా కొనసాగుతుంది. కాని ఏజ్ కాస్త ఎక్కువగా కనిపించిందో ఏమో కాని అనసూయను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. అందుకేనేమో ఈ మధ్య సినిమాల నుంచి కూడా కాస్త మాత్రం వెనక్కి తగ్గింది.ఏదేమైనా ఇదే కోవలో మరో యాంకర్ లాస్య కూడా వచ్చి చేరింది. నిజానికి అనసూయ, రష్మితో పోలిస్తే ట్రెడిషనల్‌గానే ఎక్కువగా కనిపించే లాస్య ఆకట్టుకునే స్మయిల్, ఎట్రాక్ట్ చేసే ఫిజిక్‌తో హీరోయిన్ అవకాశం కొట్టేసింది. ఆ సినిమా పేరు 'రాజా మీరు కేక'. రేవంత్, నోయల్, మిర్చి హేమంత్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు.
యాంకర్ నుంచి హీరోయిన్‌గా రష్మి, అనసూయ తర్వాత వస్తున్న లాస్య ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







