ప్రవాస భారతీయ దివస్‌కు వెళ్లనున్న యు.ఏ.ఈ తెలుగు వాసులు

- January 06, 2017 , by Maagulf

ఉద్యానవన నగరి బెంగళూరు ప్రవాస భారతీయ దివస్‌ నిర్వహణకు సిద్దమైంది. శనివారం నుంచి సోమవారం వరకూ జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 6,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని కర్ణాటక మంత్రి ఆర్‌.వి.దేశపాండే వెల్లడించారు. 
యు.ఏ.ఈ నుండి 15 మందిలో మన తెలుగు వారు వక్కలంక శ్రీనివాస రావు,కటారు వెంకట సుదర్శన,బాలాంత్రపు వెంకట సుందరం,కృష్ణన్ రంగస్వామి,శ్రీనివాస్ జనగామ ఎంపికయ్యారు. వీరందరూ ఇవాళ రాత్రి బెంగళూరు చేరుకోనున్నారు.శనివారం జరగనున్న యువ ప్రవాస భారతీయ దివస్‌కు సురినామ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ అశ్విన్‌ అధీన్‌ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఆదివారం ప్రధాని మోదీ కీలకోపన్యాసాన్ని చేస్తారు. ఆదివారం సాయంత్రం ముగింపు ఉత్సవానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com