ప్రవాసీ మిత్ర ఆవార్డు గ్రహీత కు సన్మానం - మరియు తాజ్ బడి ప్రారంభం....

- January 08, 2017 , by Maagulf
ప్రవాసీ మిత్ర ఆవార్డు గ్రహీత కు సన్మానం - మరియు తాజ్ బడి ప్రారంభం....

సౌదీ అరేబియాలో పారిశ్రామిక పట్టణమైన రాబీఖ్ లో శుక్రవారం తెలుగు వారి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో చుట్టు పక్కల ఎడారి గ్రామాలనుండి వచ్చిన తెలుగు కుటుంబాలు, రాబీఖ్ లోని పారిశ్రామిక సంస్ధలలో పని చేస్తున్న తెలుగు ప్రవాసీయులు ఉత్సహాంగా పాల్గోన్నారు. పీతాని శేషు కుమార్ అధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఎడారి ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధి చెందిన కొద్ది, తెలుగు ప్రవాసీయుల రాక పెరిగిందని, రాబీఖ్ లోని తెలుగు ప్రవాసాంధ్ర ప్రముఖుడు తాజ్ రాబీఖ్ పట్టణ కార్యదర్శిపీతాని శేషుకుమార్ ఈ సందర్బంగా  వ్యాఖ్యానించారు. ఈ రోజు కొన్ని వందల మంది తెలుగు ప్రవాసీయులు ఉండడంతో తెలుగు సంస్కృతి కొరకు తాజ్ అధ్వర్యంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నారని, ఆయన కొనియడారు.తెలుగు భాష వ్యాప్తి కోసం తాజ్ బడిను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.మారుమూల ప్రాంతంలో మాతృ భాషపై ప్రేమతోఒక్కోక్కరుగా చేరి అందరు సమిష్ఠిగా పనిచేయడం సంతోషంగా ఉందని తాజ్ రాబీఖ్ ప్రముఖుడు వైకుంఠ రావు చెప్పారు.

  సౌదీ అరేబియా వ్యాప్తంగా తెలుగుతనం వ్యాప్తి కోసం తాజ్ సంస్ధ కృషి చేస్తుందని అధ్యక్షుడు మోహ్మద్ యూసుఫ్ పెర్కోన్నారు. తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్ తెలుగు వారందరిని సమైక్య పరిచే దిశలో పని చేస్తుందని ..తెలుగు వారందరు తాజ్ ను తమ కుటుంబం లా భావించాలని ,తెలుగు వారి కష్ట సుఖాల్లో వారికి తాజ్ అండగా నిలుస్తుందని అన్నారు. రాబీఖ్ లోని యువ ప్రవాసీయులు తాజ్ సంస్ధ అవిర్భవం నుంచి కలిసి పని చేస్తున్నారని ఆయన అభినందించారు. తెలుగు భాష వ్యాప్తి కోసం తాజ్ బడినురాబీఖ్‌లో ప్రారంభించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తాజ్ బడి ప్రముఖు లు శ్రీ కుంట సాగర్, పితాని శేషు కుమార్ సేవలను అభినందించారు, తాజ్’  యాంబు’  పట్టణ కార్య దర్శి శ్రీ కిరణ్ కుమార్’  తో పాటు శ్రీ శర్మ’ గారు తదితరులు మాట్లాడారు.” ప్రవాసీ మిత్ర ఆవార్డు” అందుకోన్న శేషు కుమార్ ను ఈ సందర్భంగా తాజ్ సంఘ సభ్యులు శ్రీ నానాజీ,మహమ్మద్  కారమతుల్లా, అంజాద్, మరియు కుంట సాగర్ మరియు రాబిగ్ సభ్యులు శ్రీ వైకుంఠ రావు ల తో తెలుగు ప్రవాసీయులు ఘనంగాసన్మానించారు.
కార్యక్రమానంతరం తాజ్ ఆస్థాన గాయకులూ శ్రీ అంజాద్ గారు తమ తెలుగు పాటలతో అలరించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com