జీఆర్ఈఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి
- January 08, 2017
అక్నూర్: జమ్ములోని అక్నుర్ సెక్టార్లోని జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అక్కడ సివిల్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జీఆర్ఈఎఫ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాతృసంస్థ. ఈ సంస్థ సరిహద్దుల్లోని రోడ్లు, భవనాలను నిర్వహిస్తుంటుంది. క్యాంపులోని జూరియన్ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో మారుణహోమానికి తెగబడ్డారు. ఈ ప్రాంతం జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకుని.. అక్కడకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.
ఇటీవల కాలంలో జమ్ము-కశ్మీర్లో ఉగ్రదాడులు పెచ్చరిల్లాయి. నవంబర్ చివరి వారంలో జరిగిన దాడిలో ఇద్దరు మేజర్లతో సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







