చిన్నప్పటి సెల్ఫ్ కంట్రోల్, పెద్దయ్యాక సూపర్ పవర్
- April 18, 2015
చిన్నతనం నుంచీ మీ పిల్లల్లో ‘సెల్ఫ్ కంట్రోల్’ అలవాటు చేయండి, పెద్దయ్యాక తాము ఎన్నుకున్న రంగంలో, ముఖ్యంగా ఉద్యోగాల వేటలో మీ పిల్లల్ని మెరికల్లా చూసుకోవచ్చని అంటోంది ఓసర్వే. స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ స్టిర్లింగ్ రీసెర్చర్ మైఖేల్ డాలీ తాము చేపట్టిన సర్వే ఫలితాల్ని విశ్లేషించి ఈ వాస్తవాన్ని వెల్లడిరచాడు. 15 వేల మంది బ్రిటిష్ చిల్డ్రన్ని ఈ సర్వే కోసం ఎంపిక చేశారు. ఏడేళ్ళ వయసున్న పిల్లల నుంచి శాంపిల్స్ తీసుకుని, వారిలోని ఇంటెలిజెన్స్ లెవల్స్నీ, ఎనలిటికల్ మైండ్‌నీ అంచనా వేశారు. సామాజిక బాధ్యత గురించి కూడా వారిని ప్రశ్నించారు. చివరికి, వాటన్నిటినీ క్రోడీకరించి రీసెర్చర్స్ ఓ అవగాహనకి వచ్చారు. చిన్నప్పుడు తక్కువ సెల్ఫ్ కంట్రోల్ ఉన్న పిల్లలు, పెద్దయ్యాక జాబ్‌ని సంపాదించడంలో పట్టుదలతో వుండలేరనీ, జీవితం పట్ల అవగాహన వారికి తక్కువగా ఉంటుందని తేల్చారు. అదే సెల్ఫ్ కంట్రోల్ విషయంలో ముందున్న పిల్లలు, పెద్దయ్యాక జీవితంలో ఎదగడానికి కసితో వుంటారనీ, ఉద్యోగాన్వేషణలో వారి ఆలోచనలు పాదరసంలా కదులుతాయని రీసెర్చర్స్ కనుగొన్నారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







