విడుదలైన 'గుంటూరోడు' ట్రైలర్.!
- January 11, 2017
మంచు మనోజ్ కథానాయకుడిగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'గుంటూరోడు'. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. హీరో మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''గుంటూరోడు' ట్రైలర్.. చూసి మీ అభిప్రాయం చెప్పండి' అని ట్వీట్ చేశారు. మనోజ్ యాక్షన్‌తో కూడుకున్న ఈ ట్రైలర్ చక్కగా ఉందని నటులు రకుల్‌ప్రీత్ సింగ్, నిఖిల్ ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. చిత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. వీరికి మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజ్ఞా జైశ్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీవరుణ్ అట్లూరి చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీ వసంత్ స్వరాలు సమకూరుస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావు రమేశ్, పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







