విడుదలైన 'గురు' టీజర్.!
- January 11, 2017
బాక్సింగే తన ప్రపంచమని 'గురు' టీజర్‌లో విక్టరీ వెంకటేశ్ అంటున్నారు. బుధవారం 'గురు' చిత్రం కొత్త టీజర్‌ను విడుదల చేశారు. 'మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి' అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్ వీడియోను వెంకటేశ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. 'ఈ చిత్రం వెంకీ సినీ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలుస్తుంది, వెంకీ ఈజ్ బ్యాక్, సూపర్ వెంకీ సర్, చక్కగా ఉంది, చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం..' అని ఫ్యాన్స్ యూట్యూబ్‌లో కామెంట్స్ చేశారు. 'సాలా ఖడూస్' అనే బాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







