తీవ్రవాదులను అణచివేసేందుకు జర్మనీ చర్యలు...
- January 12, 2017
- ఎలక్ట్రానిక్ ట్యాగ్‌లతో గుర్తింపునకు యత్నాలు
బెర్లిన్ : గతేడాది బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్‌లో దాడి జరిగిన నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, పర్యవేక్షణా చట్టాలను ప్రక్షాళన చేయాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. జర్మనీలో ఆశ్రయం కోరేవారిని, ఆశ్రయం పొందలేక తిరిగి వెళ్ళేవారిని, రాజకీయ తీవ్రవాదులను పర్యవేక్షించేందుకు ఎలక్ట్రానిక్ ట్యాగ్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని న్యాయ శాఖ మంత్రి తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన రాజకీయ అసమ్మతివాదులకు కూడా ఈ ట్యాగ్‌లు వర్తిస్తాయని తెలిపారు. రాడికల్ భావాలతో వ్యవహరించేవారిని కనుగొని వారు హింసాత్మక తీవ్రవాదం వైపు మళ్ళకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది డిసెంబరు 19న బెర్లిన్ మార్కెట్‌లో జరిగిన దాడిలో 12మంది మరణించగా, 49మంది గాయపడ్డారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 16 నిఘా సంస్థల స్థానే ఒకే ఒక జాతీయ సంస్థను తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







