ప్రపంచ సుందరి పోటీలకు సిక్కు యువతి..
- January 12, 2017
కౌలాలంపూర్ : మలేషియాలో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో భారత సంతతి సిక్కు యువతి పాల్గొంటున్నారని పోటీల నిర్వాహకులు తెలిపారు. కిరణ్మీత ్కౌర్ బల్జీత్‌సింగ్ జసాల్ (20) గతేడాది మిస్‌యూనివర్స్ మలే షియా టైటిల్ సొంతం చేసుకున్నా రని చెప్పారు. ఈనెల30న మనీలాలో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఆమె పాల్గొంటారని అన్నారు. జసాల్ కుటుంబ సభ్యులు కొన్నేండ్ల కిందట భారత్ నుంచి మలేషియాకు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లి రంజిత్ కౌర్ గతేడాది జరిగిన మిసెస్ మలేషియా టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. జసాల్ సోదరీ రణ్మీత్ భారత్‌లోనే ఉంటూ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మెడిసిన్ చేస్తున్నారు.
చదువుతో పాటు మోడలింగ్ రంగంలోనూ ఆమె రాణిస్తున్నారు. జసాల్ రెండో సోదరి కిరణ్..ఇంటర్నేషన్ మెడికల్ యూనివర్సిటీలో డెంటిస్టు కోర్సు చదువుతున్నారు. జసాల్ చెల్లెలిద్దరూ బ్యూటీ క్వీన్స్ అంటూ సినీనటులు ఐశ్వర్యారారు (1994లో మిస్ వరల్డ్ టైటిల్ గ్రహీత ), సుష్మితా సేన్ ( 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గ్రహీత ) కితాబిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







