విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన తాగుబోతు ప్రయాణికుని జైలుశిక్ష

- January 14, 2017 , by Maagulf
విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన తాగుబోతు ప్రయాణికుని జైలుశిక్ష

దోహా : మద్యం మర్యాద నిలపదని నానుడి. నరాల్లో నిషా...మెదడులోని మత్తు ఆ విమాన ప్రయాణికుడిని కట కటాలకు తీసుకువెళ్ళేవరకు వదలలేదు.. మైకంలో మునిగిపోయిన ఆ ప్రయాణికుడు విమానం నడిపే క్యాబిన్ బోర్డులోనికి ప్రవేశించి సిబ్బందిని ఇబ్బందుల పాల్జేసిన నేరానికి ఇంటికి చేరుకోవాల్సిన ఆ వ్యక్తి ఇక్కట్ల పాలయ్యాడు.  దోహా క్రిమినల్ కోర్టు రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు100,000 కతర్ రియాళ్ళు జరిమానా విధించింది. పూటుగా మద్యం సేవించి ఆపై విమానంలో అడుగుపెట్టిన ఆ ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి దోహా చేరుకోవాల్సి ఉంది. సేవించిన మద్యం అల్లరిపాలు చేయడమే కాక అతని  ఆగడాలు శృతి మించాయి. ఎయిర్ హోస్టెస్ లను వేధింపులకు గురిచేయడమే కాక  విమానం నడిపే సిబ్బంది క్యాబిన్లో సైతం ప్రవేశించి  పైలట్ల ముందు వీరంగం చేయడంతో విమానం ఎలా నడపాలో తెలియకుండా వారు తికమకలకు గురి చేశాడు. దీనితో  ఆ దోసుబాబు అల్లరిని ఇక భరించలేకపోయారు. ఆ వ్యక్తి భద్రత మరియు ఇతర ప్రయాణికులకు అసౌకర్యంగా మారిన ఆ తాగుబోతు ప్రయాణికుడిని ఎలాగోలా సముదాయించి విమానంను దోహాకు తీసుకువచ్చిన సిబ్బంది ఆ తర్వాత ఆ వ్యక్తిని ఆందోళన భద్రతా శాఖ అప్పగించారు. దోహా నేర న్యాయస్థానం తుదకు అతనిని దోషిగా తేల్చింది. ఆ ప్రయాణికుని ఆగడాలను మరింతగా వివరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com