బహరేన్ లో నిర్వాసిత పాకిస్థాన్ సైక్లిస్ట్ మృతి

- January 14, 2017 , by Maagulf
బహరేన్ లో నిర్వాసిత పాకిస్థాన్ సైక్లిస్ట్  మృతి

మనామా: స్థానిక కువైట్ రోడ్ ప్రాంతంలో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి  సైకిలు తొక్కుతూ వెళుతున్న సమయంలో ఒక వాహనం డీ కొనడంతో అక్కడికక్కడే మరణించాడు, ఆంతరంగిక మంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్ లో ప్రకటించింది. పోలీసులు అవసరమైన చర్యలను తీసుకున్నారు. వేగంగా వస్తున్న వాన్ సైక్లిస్ట్ ని డీ కొట్టింది. ఈ దుర్ఘటన మినా స్లామం ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సైక్లిస్ట్ పాకిస్తాన్ నుండి ఇక్కడకు వచ్చి ప్రవాస జీవితం గడుపుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా ఆ వ్యక్తి ఆయుష్షు తీరిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com