తెలుగు తరంగిణి రస్ అల్ ఖైమా వారి సంక్రాంతి సంబరాలు

- January 15, 2017 , by Maagulf

తెలుగు తరంగిణి వారి ఆర్ధ్వర్యంలో యు.ఎ.ఇ లోని రస్ అల్ ఖైమా నగరంలో సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. జాతీయ గీతం మరియు ప్రార్ధనలతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి

 

భోగి మంటలు, హరిదాసుల సందడితో మొదలైన సంబరాలు, సంప్రదాయం దుబాయి వారి సౌజన్యంతో శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం, తిరుప్పావై, అన్నమయ్య కీర్తనలు, సామూహిక విష్ణు సహస్ర నామార్చన , కూచిపూడి నృత్యాలతో, ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా కొనసాగింది.

 

అనంతరం రంగవల్లుల పోటి, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువు, తెలుగు జానపద నృత్య ప్రదర్శన మరియు కమ్మని విందు భోజనాలతో పల్లెలలోని సంక్రాంతిని సుదూరతీరాలలో ఉన్న రస్ అల్ ఖైమా నగరం లోని సుమారు 1000 మంది తెలుగు వారి ముందుకు ఆవిష్కరించారు. తెలుగు సంస్కృతీ  సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో చిన్న పిల్లల ఆటపాటలతో సరదా సరదాగా సాగింది తరంగిణి వారి సంక్రాంతి.

 

హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ వాస గోపీనాథ్, శ్రీ కొర్రపాటి రాఘవేంద్ర , శ్రీమతి వేటూరి కాంతి , దుబాయ్ నుండి వచ్చిన శ్రీమతి ఇందిరా రావు మరియు శ్రీమతి లలితా కుమార్ కర్ణాటక సంగీత కచేరీ అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

 

ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్తలు శ్రీమాన్ సామవేదం షణ్ముఖ శర్మ , శ్రీమాన్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి  మరియు శ్రీమాన్ వద్దిపర్తి పద్మాకర్  తెలుగు తరంగిణి మరియు యు ఏ యి లోని తెలుగు వారిని ఆశీర్వదిస్తూ ప్రత్యేక వీడియొ సందేశాలు పంపించారు.

 

తెలుగు తరంగిణి అద్యక్షులు సురేష్ , ఉపాధ్యక్షులు మోహన్ , కార్యదర్శులు నందా , శ్రీనివాస్ ,  కోశాధికారి రాజేష్  మరియు తరంగిణి సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు తరంగిణి సభ్యులు సుజన్ , మైథిలి గారు ఏంకర్లుగా వ్యవహరించారు.

బిట్స్ రస్‌ అల్‌ఖైమా ఆవరణలో  జరిగిన  ఈ కార్యక్రమానికి  మా గల్ఫ్‌.కామ్‌ మీడియా సహకారం అందించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com