విడుదలైన 'నేను లోకల్' ట్రైలర్
- January 15, 2017
నేచురల్ స్టార్ నాని... సంక్రాంతి పండుగ సందర్భంగా 'నేను లోకల్' అంటూ హంగామా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను లోకల్ ట్రైలర్...సంక్రాంతికి విడుదలైంది. 'ఒక అమ్మాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతోందంటే అది మార్చి అని అర్థం, అదే ఒక అబ్బాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతున్నాడంటే అది సెప్టెంబర్' అని అర్థం అంటూ సహజమైన నటనతో ఎప్పటిలాగే నాని ఇరగదీశాడు.
బుద్ధిమంతుడులా అమ్మానాన్నల కోసం కాలేజీకి వెళతానంటూనే మరోవైపు ఎంబిఎ చదువుతా అమ్మాయిని ఫాలో అవుతానంటూ వాళ్లకి పంచ్ వేస్తాడు. హీరోయిన్ ను ఫాలో అవుతూ ఆమెను డిస్ట్రబ్ చేస్తూ ఆమె తండ్రితో వీడు జండూబామ్కి తలనొప్పి రప్పించే రకంగా ఉన్నాడంటూ. పిచ్చెక్కించేలా నాని తన నటనతో హల్ చల్ చేశాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తోనే సినిమాతో అంచనాలు పెంచేసిన నాని... ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ శనివారం కాకినాడలో జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







