బహ్రెయిన్ లో పోలీసు అధికారులను హతమార్చిన ముగ్గురికి మరణశిక్ష
- January 15, 2017
మనామా: ముగ్గురు పోలీసు అధికారులను హతమార్చిన ముగ్గురిని దోషులుగా తేల్చిన తర్వాత వారికి మరణశిక్షను ఈ ఆదివారం ఉదయం ( నేడు ) బహరేన్ అమలుచేసింది. రెండేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన యుఎఇ ఆర్మీ అధికారి మొదటి లెఫ్టినెంట్ తారిక్ అల్ షెహి సైతం ఆ నేరస్థులు బలికొన్నవారిలో ముగ్గురు అధికారులలో ఉన్నారు. తీవ్రవాద నేరాలను విచారించే ప్రాసిక్యూషన్ అధిపతి అహ్మద్ అల్ హమ్మది మాట్లాడుతూ, ఈ మరణశిక్షల ఒక కాల్పుల దళం మరియు ఒక న్యాయమూర్తి సమక్షంలో ఈ రోజు ఉదయం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను తుపాకులతో కాల్చి చంపేటప్పుడు ప్రజా విచారణ చట్టం ప్రతినిధి, జైలు వార్డెన్, ఒక వైద్యుడు మరియు ఒక బోధకుడు ఉన్నారు. చట్టబద్ధంగా సూచించిన విధానాలు కస్సాషన్ యొక్క తుది తీర్పు తర్వాత నిందితులకు మరణశిక్ష అమలకు రంగం సిద్ధం అయ్యిందని అల్ హమ్మది తెలిపారు, అటార్నీ జనరల్ అందుకు అనుగుణంగా అనుగుణంగా దానిని అమలు జరపాలని పిలుపునిచ్చారు. మనామా రాజధాని శివార్లలో దయ్య గ్రామంలో మార్చి 3 వ తేదీన 2014 న ముగ్గురు పోలీసులని ఈ నిందితులు మట్టుపెట్టారు. 22 నెలల అంతరం గత సోమవారం, అల్ షెహి మరియు పోలీసు అధికారి మొహమ్మద్ రస్లాన్ మరియు ఎమ్మార్ అబ్దు ఆలీ మొహమ్మద్ చంపిన నేరాలలో కస్సాషన్ కోర్టు ఎదుట ముగ్గురు నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించడంతో వారిని దోషిగా నిర్ధారించింది మరణశిక్షని ఖరారు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







