రూ.2100కోట్లుతో ఈఫిల్‌టవర్ నవీకరణ
- January 15, 2017
పారిస్‌లోని ఈఫిల్ టవర్ అందం రెట్టింపు కానుంది. ఏటా దాదాపు 70 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోన్న టవర్ అందాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాలని పారిస్ నగర పాలకవర్గం నిర్ణయించింది. టవర్ నవీకరణతో పాటు.. సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 300మిలియన్ యూరోలు(రూ.2170 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఒలింపిక్స్ గేమ్స్.. 2025లో యూనివర్సల్ ఎగ్జిబిషన్‌కు పారిస్ నగరం వేదిక కానుంది. అపట్లోగా ఈఫిల్ టవర్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్ధేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కేటాయించిన నిధుల్లో సగం టవర్ నవీకరణకే ఖర్చు చేయనున్నారట. ప్రస్తుతం వెలుగులు జిమ్ముతున్న విద్యుత్ దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు.. లిఫ్టులకూ మరమ్మతులు చేస్తామని పారిస్ డిప్యూటీ మేయర్ ఫ్రాంకోయిస్ మార్టిన్స్ వెల్లడించారు. మరో వెయ్యి కోట్లు పర్యాటకుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు.. ఎండ.. వాన.. మంచుతో సందర్శకులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయనున్నారట. అలాగే.. గత రెండేళ్లలో ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో భద్రతను మరింత మెరుగుపరచనున్నట్లు అధికాలు తెలిపారు. ఈ నెలాఖరులోగా పారిస్ కౌన్సిల్లో ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందే వీలుందట.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







