కుప్ప కూలిన విమానం, 32 మంది మృతి
- January 15, 2017
కిర్జిస్థాన్ లోని మనాస్ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టర్కీష్ ఎయిర్ లైన్స్ కార్గోకు చెందిన విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారని కిర్జీ ప్రభుత్వం ప్రకటించింది.
సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఓ పైలట్, మరో 29 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో స్థానికులే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా విమానంలో ఎంత ఉన్నారు, ఎక్కడకు వెళ్తోంది వంటి విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు







