షార్జాలో గాలి బెలూన్ కూలిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు..
- January 16, 2017
స్థానిక అల్ మేడమ్ ప్రాంతంలో వేడి గాలి బెలూన్ ఒక్కసారిగా కిందకు పడటంతో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు శనివారం రాత్రి 9 గంటలకు, ఈ సంఘటన గురించి ఫోన్ కాల్ అందుకున్నట్లు తెలిపారు.దీనితో వారు వెంటనే ఆ ప్రాంతానికి ఒక జట్టుని పంపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.సెంట్రల్ రీజియన్ పోలీసు స్టేషన్ డైరెక్టర్ అహ్మద్ బిన్ దార్విష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలి బెలూన్ అకస్మాత్తుగా కిందకు పడిపోయిందని అయితే, ఇందుకు వాస్తవ కారణం తెలియదని అయితే ఈ ప్రమాద కారణం గుర్తించడానికి పరిశోధన జరుగుతోందని ఆయన వివరించారు. వాతావరణంలో గాలి వేగం పెరిగిన నేపథ్యంలో గాలి బుడగ కిందకు పడి ఈ ప్రమాదంకు కారణం కావచ్చోమేనని అయితే పూర్తి పరిశోధన అయ్యే వరకు వేచి ఉండాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







