ఫేస్బుక్, వాట్సాప్‌లకు నోటీసులు
- January 16, 2017
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు అయిన వాట్సాప్, ఫేస్బుక్ లలో వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), ఫేస్బుక్,వాట్సా ప్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు దేశంలోని 15 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యత లేకుండా చేస్తున్నాయంటూ దాఖలైనపిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
ఈ సందర్భంగా న్యాయవాది హరీశ్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ సామా జిక మాధ్యమాలు ఆర్టికల్19, 21 ప్రకారంరాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొ న్నారు. అనంతరం దీనిపై వివరణ ఇవ్వా లంటూ కేంద్రం, ట్రాయ్, ఫేస్బుక్, వాట్సాప్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ పిటిషన్ విషయంలోఅటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహాయాన్ని ధర్మాసనం కోరింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







