అబుధాబీ క్యాబ్స్ లో కెమెరాలు - పెరిగిన నిజాయితీ, భద్రతలు
- September 12, 2015
యూ. ఏ. ఈ. రాజధాని అబుధాబీలోని క్యాబ్ లలో CCTV కెమెరాలు, సౌండ్ రికార్డింగ్ సిస్టంల ఏర్పాటుపై క్యాబ్ డ్రైవర్లు మరియు ప్రయాణీకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ నెలలో మొదలైన ఈ ప్రక్రియ జూన్ 2016 కల్లా పూర్తవుతుందని తెలియవచ్చింది. దీనివల్ల, ప్రమాదకరంగా లేదా వేగంగా డ్రైవ్ చేయడం, తద్వారా వచ్చే ప్రమాదాలను, నడిపేటపుడు మొబైల్ ఫోన్లలో మాట్లాడడం వంటి వాటిని కూడా నివారించడంలో ఉపయుక్తంగా ఉంది. ఈ విధానం ఏర్పాటుచేసిన నాటినుండి ఛార్జీలు చెల్లించకుండా వెళ్ళిపోయే వారు, వేచి ఉండమని ఇంకా రాకుండా ఉండేవరితో వారితో ఇబ్బందులు తప్పాయని, ప్రయాణీకుల వివాదాలు, దురుసుప్రవర్తన తగ్గిందని, తమ పని సులువైందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక భారతీయ డ్రైవర్ సంతోషిస్తుండగా,తమకు కూడా డ్రైవర్ల వల్ల వచ్చే ఫోన్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా నడపడం వంటి ప్రమాదాలు తప్పాయని జైనాబ్ హాష్మీ, స్యామ్ కెంట్ వంటి ప్రయాణీకులు సంతోషిస్తున్నారు. ట్రాన్స్ ఎ. డి. కి చెందిన అహ్మెద్ ముస్తఫా, ఈ సంవత్సరాంతానికి ఇంచుమించు 5000 క్యాబ్ లు CCTV సిస్టం ను కలిగిఉంటాయని, రాబోయే కొత్త కార్లలో ఎలాగూ ఇది ఇమిడి ఉంటుందని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







