"గల్ఫ్" తెలుగు సినిమా ప్రమోషనల్ సాంగ్ లిరిక్స్
- September 12, 2015
పల్లవి : ఆశల రెక్కలు కట్టుకొని పొట్టన చేతిలో పట్టుకొని
వలసల బాటలో కాసుల వేటలో దేశం దాటిన నీకు సలాం
మండే ఎండలు తట్టుకొని బాధను గుండెలొ పెట్టుకొని
చీకటి మాటున రేపటి పూటకు వెలుగులు దాచిన నీకు సలాం
ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో నీ బ్రతుకును త్యాగం చేసి
కన్నీళ్ళో కష్టాలో లోలోపల దిగమింగేసి
స్వేచ్ఛను వదిలి స్వచ్ఛoదంగా బంధీవయితివి నీకు సలాం
తెగించి కదిలి భారత భావుట ఎగరేస్తుంటే నీకు సలాం
గల్ఫ్ లో నీ గాధలు ఎన్నో...గల్ఫ్ లో నీ బాధలు ఎన్నో
అపజయాలు నీకున్నా గల్ఫ్ ల విజయాలు ఇంకెన్నో
చరణం(1) : అసలే పరాయిదేశం అక్కడ పూట పూటకొ వేషం
నీకు నువ్వే చుట్టం అక్కడ ఇనుప సంకెళ్ల చట్టం
తెలిసీ తెలియని నగరం అది ముసుగు వేసిన నరకం
అయినా గానీ పయనం నిప్పుల గుండం నీ గమనం
గెలుపు ఓటమి రెండూ ఉన్నా పోరాటమే నీనైజం
నీడ నీకు లేకున్నా ఓ గోడుకోసమే నీయత్నం
జీవిత రణరంగంలో నువ్వే సైనికుడైతివి నీకు సలాం
కుటుంబాన్ని నడిపించగ నువ్వే నాయకుడైతివి నీకు సలాం
గల్ఫ్ లో నీ గాధలు ఎన్నో...గల్ఫ్ లో నీ బాధలు ఎన్నో
అపజయాలు నీకున్నా గల్ఫ్ ల విజయాలు ఇంకెన్నో ...
చరణం(2):చుట్టూ ఎడారి ప్రాంతం తడి ఆరనిది నీ పంతం
అవసరం వస్తే మార్గం నీ శ్రమతో చేస్తివీ స్వర్గం
ఇసుకను పసిడిగా మార్చి బహు సంపదనే సృష్టించి
ప్రగతి పూలు పూయించి ఆ పరిమళాలు ఇటుపంచి
అగాధమైన అరబ్బు చరిత్రను అంబరాన్ని ఎక్కించి
ప్రపంచ దేశాలు అబ్బురపడగా మేధస్సుతో మెప్పించి
చమురును మించిన సత్తువని స్వేదం ఉందని చాటావు సలాం
ఎంతటి కష్టమైనగానీ అవుతుంది ఇక నీకు గులాం
గల్ఫ్ లో నీ గాధలు ఎన్నో...గల్ఫ్ లో నీ బాధలు ఎన్నో
అపజయాలు నీకున్నా గల్ఫ్ ల విజయాలు ఇంకెన్నో
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









