సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- April 19, 2026
యూఏఈః బలమైన సముద్ర అలల నుండి తన చెల్లెలిని, ఇద్దరు కజిన్‌లను కాపాడే ప్రయత్నంలో రాస్ అల్ ఖైమాలో 13 ఏళ్ల యూఏఈ బాలుడు నీట మునిగి చనిపోయాడు. ఏప్రిల్ 14న (మంగళవారం )సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని అతని తండ్రి తెలిపారు. మృతుడిని మహమ్మద్ అహ్మద్ బిన్ అమెర్ అల్ షెహీగా గుర్తించారు. పలువురు చిన్న పిల్లలతో సహా తన కుటుంబంతో కలిసి బీచ్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
తండ్రి చెప్పిన ప్రకారం.. పిల్లలు తీరం దగ్గర ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా వచ్చిన అలలు మరియు బలమైన ప్రవాహాలు వారిలో కొందరిని మరింత సముద్రంలోకి లాగేశాయి. పిల్లలలో అందరికంటే పెద్దవాడైన మహమ్మద్, పరిస్థితి విషమిస్తున్నట్లు గమనించి, అంతకు ముందే నీటి నుండి దూరంగా వచ్చేశాడు.
అయితే, తన ఏడేళ్ల చెల్లెలు మరియు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు కజిన్‌లు ప్రవాహంలో మరింత లోపలికి వెళ్లారు. వారిని కాపాడటానికి అతను తిరిగి నీటిలోకి వెళ్లాడు. మహమ్మద్ తన చెల్లెలిని, కజీన్లు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి, మునిగిపోకుండా కాపాడగలిగాడని అతని తండ్రి చెప్పారు.
అయితే, ఈ రక్షణ ప్రయత్నంలో మహమ్మద్ బాగా అలసిపోయాడు. అతను ఒడ్డుకు తిరిగి వచ్చేలోపే, అధిక మొత్తంలో సముద్రపు నీటిని మింగి, స్రృహ కోల్పోయాడని బంధువులు తెలిపారు. రెస్క్యూ బృందాలు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడని తండ్రి చెప్పారు. మహమ్మద్ సోదరి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటన జరిగిన బీచ్‌లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







