మస్కట్‌ ఫెస్టివల్‌కి మవసలాత్‌ స్పెషల్‌ సర్వీసులు ...

- January 18, 2017 , by Maagulf
మస్కట్‌ ఫెస్టివల్‌కి మవసలాత్‌ స్పెషల్‌ సర్వీసులు ...

మస్కట్‌: మస్కట్‌ ఫెస్టివల్‌ కోసం మవసలాత్‌ స్పెషల్‌ సర్వీసుల్ని ప్రారంభించింది. మస్కట్‌ ఫెస్టివల్‌కి వెళ్ళేవారికి ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రువి - అమెరాత్‌ పార్క్‌ రూట్‌లో రెండు బస్సుల్ని ప్రారంభించగా, మాబెలా - నసీమ్‌ గార్డెన్స్‌ రూట్‌లో నాలుగు బస్సుల్ని ప్రవేశపెట్టారు. మస్కట్‌ ఫెస్టివల్‌ కోసం ఈ బస్సుల్ని అదనంగా ఏర్పాటు చేశారు. రువి - అమెరాత్‌ పార్క్‌, మాబెలా - నసీమ్‌ గార్డెన్స్‌ రూట్‌లో ప్రతి 20 నిమిషాలకు ఓ బస్సు మధ్యాహ్నం 3.15 నిమిషాల నుంచి 11.10 నిమిషాల వరకు అందుబాటులో ఉంటుంది. 
కరాటా ఎస్‌ప్లానడెలో వింటర్‌ ఫెస్టివల్‌కి రంగం సిద్ధం 
కటారా ఎస్‌ప్లానెడె, నాలుగవ వింటర్‌ ఫెస్టివల్‌కి ముస్తాబయ్యింది. జనవరి 22 నుంచి 25 వరకు ఈ ఫెస్టివల్‌ని నిర్వహించనున్నారు. వర్క్‌ షాప్‌లు, ట్రెడిషనల్‌ షోస్‌, గేమ్స్‌ మరియు పెర్ఫామెన్సెస్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖతార్‌ రెసిడెంట్స్‌కి ఈ ఫెస్టివల్‌ ఆనందోత్సాహాల్ని నింపనుంది. కటారా కల్చరల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఖాలిద్‌ బిన్‌ ఇబ్రహీమ్‌ మాట్లాడుతూ, కటారా వింటర్‌ ఫెస్టివల్‌లో ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్స్‌, ఎంటర్‌టైనింగ్‌ పెర్ఫామెన్సెస్‌ ఆహూతుల్ని అలరిస్తాయని చెప్పారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పలు ఈవెంట్స్‌ని డిజైన్‌ చేశామనీ, అలాగే ఫ్యామిలీతోపాటు, ఫ్రెండ్స్‌తోపాటు ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేలా ఇక్కడి వాతావరణాన్ని తీర్చిదిద్దామని వివరించారాయన. అరేబియన్‌ ఔద్‌ ఫెస్టివల్‌ అలాగే స్కూల్స్‌ స్ప్రింగ్‌ బ్రేక్‌ ఈ సారి వింటర్‌ ఫెస్టివల్‌కి కలిసొచ్చాయి. అల్‌ గన్నాస్‌ అసోసియేషన్‌, ఇంటరాక్టివ్‌ ఎగ్జిబిషన్‌ మరియు వర్క్‌ షాప్‌ని నిర్వహిస్తోంది. బిన్‌ ముఫ్తా మెడికల్‌ సెంటర్‌, ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఓ వినూత్న కార్యక్రమం ఇక్కడ చేపట్టబోతోంది. ఖతార్‌కి చెందిన పలు ఇన్‌స్టిట్యూట్స్‌ విజిటర్స్‌కి ఆశ్చర్యం గొలిపే బహుమతుల్ని కూడా ఇవ్వనున్నాయి. 
నో హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ నో దుబాయ్‌ వీసా 
మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌తో వీసా రెన్యువల్‌ ప్రాసెస్‌ని లింకప్‌ చేసిన ప్రక్రియ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. జనవరి 1 నుంచి దీన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫండింగ్‌ డాక్టర్‌ హైదర్‌ అల్‌ యూసుఫ్‌ మాట్లాడుతూ, మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ తప్పనిసరికి సంబంధించిన డెడ్‌లైన్‌ పొడిగించినప్పటికీ, దుబాయ్‌ నేచురలైజేషన్‌ మరియు రెసిడెన్సీ డిపార్ట్‌మెంట్‌ (డిఎన్‌ఆర్‌డి) ఇప్పటికే వీసా ఇన్స్యూరెన్స్‌ - మెడికల్‌ ఇన్స్సూరెన్స్‌ సిస్టమ్‌ని యాక్టివేట్‌ చేసిందని అన్నారు. అయితే గడువు లోపట ఎలాంటి జరీమానాలూ విధించబడవు. గడవు పొడిగింపు ఉద్దేశ్యం ఇన్స్యూరెన్స్‌ చేయించుకోవడానికి అవకాశం కల్పించడమే తప్ప, అది అవసరం లేదని కాదని అధఙకారులు స్పష్టం చేశారు. దుబాయ్‌లో 98 శాతం మందికి ఇన్స్యూరెన్స్‌ లేదని గతంలో వెల్లడయ్యింది. ఇన్సూరెన్స్‌ని తప్పనిసరి చేస్తూ 2016 మధ్యనాటికి డెడ్‌లైన్‌ని విధించారు, దాన్ని డిసెంబర్‌ 31 వరకు పొడిగించారు. ఇన్సూరెన్స్‌ తప్పనిసరి చేస్తూ రూపొందించిన చట్టం ప్రకారం ఇన్సూరెన్స్‌ లేనివారికి నెలకు 500 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com