జెట్ ఎయిర్ వేస్ 'టూ ఫర్ వన్' ఆఫర్..
- January 19, 2017జెట్ ఎయిర్ వేస్ సంస్థ తమ వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ని ప్రకటించింది. రెండు టిక్కెట్లను ఒకే టిక్కెట్ ధరకు పొందేలా ఈ ఆఫర్‌ని రూపొందించారు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా దీన్ని ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్, ఇండియా, ఏసియన్ మరియు సార్క్ దేశాలకు గల్ఫ్‌తో కనెక్ట్ అయ్యే తమ విమానాకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. బ్యాంకాక్, కొలంబో, ఢాకా, హాంగ్‌కాంగ్, కాట్మండు, సింగపూర్ తదితరదేశాలతో కలిపి మొత్తం 46 డెస్టినేషన్స్ ఇందులో ఉన్నాయి. వన్ వే మరియు రిటర్న్ జర్నీలకు కూడా తక్షణం వర్తించేలా ఈ ఆఫర్‌ని రూపొందించారు. ఈ ఆఫర్లో టిక్కెట్లను కొనుగోలు చేసే ఇద్దరు ప్రయాణీకులూ కలిసి ఒకేసారి ఒకే విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం