జనవరి 24న కాటమరాయుడు ఆడియో వేడుక..

- January 19, 2017 , by Maagulf
జనవరి 24న  కాటమరాయుడు ఆడియో వేడుక..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా "కాటమరాయుడు" గోపాల గోపాల దర్శకుడు డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్నది.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నసంగతి విధితమే.. నలుగురు తమ్ముళ్ళ కు అన్నగా పవన్ నటిస్తున్నారు.. పవన్ సరసన గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలో జోడీ కట్టిన శ్రుతి హాసన్ నటిస్తోంది. పవన్ కల్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.. గోపాల గోపాల్ మూవీకి అనూప్ అందించిన సంగీతం ఇప్పటికీ అందరినీ అలరిస్తూనే ఉన్న నేపద్యంలో ఈ సినిమాలో సాంగ్స్ పై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకొన్నారు.. కాగా ఈ సినిమా ఆడియో వేడుకను జనవరి 24న విజయవాడ లో నిర్వహించనున్నట్లు శరత్ ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com