ఒమన్ లో సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగిపోయిన ఇద్దరు సోదరీమణులు
- January 20, 2017
మస్కట్ : ఆ ఫోటో వారికి చివరి ఫోటో అవుతుందని...వారు ఊహించలేదు...నీటి కొలను వద్ద ముచ్చటగా సెల్ఫీ దిగుదామనుకొని..అంచు వద్దకు వెళ్ళి దిగితే మరింత అందంగా వస్తుందనుకొని అందరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ దుర్ఘటన జాలం బాణీ బు ఆలీ లో జరిగిందని ఓ ఇరువురు సోదరీమణులు నీళ్లలో మునిగి గల్లంతయ్యారని రాయల్ ఒమన్ పోలీస్ ట్వీట్ చేశారు ఏసిల ప్రాంతంలో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు నీటిలో ఒక్కసారిగా మునిగిపోయారని తెలిపారు. అక్టోబర్ 2016 లో ఇరువురు శ్రీలంక అమ్మాయిలు సలలాహ్ కు కుటుంబ పిక్నిక్ వచ్చారు. సెల్ఫీ తీసుకొందామని ఆ శ్రీలంక అమ్మాయిలు, ఐన్ జాజిజ్ నీటి కొలను పక్కన ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు...ఈ సమయంలో ఒక మహిళ అకస్మాత్తుగా పడిపోయింది. ఈ కంగారులో మునిగిపోయిన ఆమె తన సోదరిని నీటిలోకి బలంగా లాగడంతో ఇరువురు మరణించారని రాయల్ ఒమన్ పోలీస్ ట్వీట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







