సంప్రదాయ క్రీడ కోసం తారల దీక్ష

- January 20, 2017 , by Maagulf

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ మెరీనా బీచ్‌లో యువత గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తోంది. వారికి సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సూర్య, అజిత్‌ తదితరులు మెరీనా బీచ్‌లో ఆందోళనలో పాల్గొన్నారు. యువతకు మద్దతుగా మరి కొంతమంది అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టనున్నారని సమాచారం. జల్లికట్టుకు మద్దతుగా ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌ ఉపవాస దీక్షలో పాల్గొంటానని ప్రకటించారు. నటులు కమల్‌హాసన్‌, లారెన్స్‌, విశాల్‌ తదితరులు యువత చేస్తున్న శాంతియుత ఆందోళనకు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com