అడివి శేష్-అవసరాల కాంబినేషన్ లో కొత్త సినిమా
- January 22, 2017
"జెంటిల్ మెన్"తో సూపర్ హిట్ అందుకొన్న తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి మరో డిఫరెంట్ జోనర్ లో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధమయ్యారు. స్క్రూ బాల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా నటిస్తుండగా.. "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై కె.సి.నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్న చిత్రంతో నిర్మాతగా మారుతుండడం సంతోషంగా ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మా చిత్రానికి సంగీత సారధ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది" అన్నారు.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవిందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహా రావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







