వలసదారులకు రెమిటెన్స్ ఫీజ్ లేదు..
- January 24, 2017
సౌదీ ఫైనాన్స్ మినిస్ట్రీ, వలసదారులకు రెమిటీస్ ఫీజు ఉండదని స్పష్టం చేసింది. కింగ్‌డమ్‌కి చెందిన అడ్వయిజరీ షురా కౌన్సిల్ ఇటీవలే 6 శతం లెవీని వలసదారుల రెమిటెన్సెస్‌పై విధించాలనే నిర్ణయం ప్రకటించిన అనంతరం తాజా ప్రకటన ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చింది. సౌదీ అరేబియాలోని 30 మిలియన్ల మందిలో మూడో వంతు వివిధ దేశాలకు చెందినవారే ఉన్నారు. వారందరికీ స్వదేశంలో కన్నా ఎక్కువగా సౌదీ అరేబియాలోనే పే స్కేల్స్ దొరుకుతున్నాయి. అయితే గత కొంతకాలంగా నెలకొన్న చమురు ధరల సంక్షోభం నేపథ్యంలో వలసదారులపై ఆదాయపు పన్నును విధించేందుకు గత ఏడాది సన్నాహాలు జరిగాయి. అయితే షురా కౌన్సిల్ తెరపైకి తెచ్చే ప్రతిపాదనల్ని అన్ని సందర్భాల్లోనూ అమలు పరచడం జరగదు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకుగాను పలు రకాలైన రుసుముల్ని పెంచడం జరిగిందనీ, అందుకే కొత్తగా వలసదారులపై ఆర్థిక భారం మోపే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచనలు జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







