రాత్రి ఫోన్ లో ప్రధాని మోడీతో మాట్లాడనున్న ట్రంప్!
- January 24, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారానికి ట్రంప్ షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా వైట్ హౌస్ వర్గాలు ఈ మేరకు పేర్కొన్నాయి.
భారతీయ కాల మాన ప్రకారం.. మంగళవారం రాత్రి 11:30 గంటలకు (వాషింగ్టన్ లో మధ్యాహ్నం ఒంటి గంట) ట్రంప్... ప్రధాని మోడీతో మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటికే నలుగురు దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడారు.
జనవరి 21న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడీ, మెక్సికో అధ్యక్షుడు పేనా నీటో లతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఈజిప్ట్ అధ్యక్షడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీలకూ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఇక ట్రంప్ మాట్లాడనున్న ఐదో దేశాధినేత మన నరేంద్ర మోడీ. నవంబర్ 8న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన అతి కొద్దిమంది దేశాధినేతలలో మోడీ ఒకరు.
ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్ ఇండియా తో సంబంధాలను మెరుగుపరచు కోవడంపై ఆసక్తి చూపారు. ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆర్ధిక సంస్కరణలను ఆయన ప్రశంసించారు కూడా. ఇప్పుడు ఆయనే స్వయంగా మోడీకి ఫోన్ చేస్తుండడం చూస్తుంటే భారత్ తో బంధం బలోపేతానికి తొలి అడుగు వేసినట్లే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







