పనస గింజల మామిడి కూర...
- January 24, 2017
కావలసిన పదార్థాలు: పనసగింజలు- 15, మునక్కాడ ముక్కలు- 10, పచ్చి మామిడి తురుము- 1/2 కప్పు, పచ్చిమిర్చి- 4, పసుపు- 1/4 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, జీలకర్ర- 1/2 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు- 4, తాలింపు దినుసులు- 1 టీ స్పూను, నూనె- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా కొబ్బరి ముక్కలు, రెండు పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రలను మిక్సీ పట్టి పక్కన ఉంచాలి. తరువాత పసనగింజలపై ఉండే తెల్లని పొట్టు తీసేసి, గింజలను కుక్కర్‌లో వేసి అర కప్పు నీళ్ళు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి తీయాలి. తరువాత ఆ గింజలతో పాటు, మామిడి తురుము, రెండు పచ్చిమిరపకాయలు, మునక్కాడ ముక్కలు, పసుపు వేసి, కప్పుడు నీళ్ళు పోసి, సన్నని మంటపై ఉడికించాలి. మునక్కాడ ముక్కలు ఉడికాక కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి. కూర పూర్తిగా ఉడికాక పోపు పెట్టుకోవాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







