అంతర్జాతీయ ట్రాఫిక్‌లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ 'టాప్'..
- January 24, 2017
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, 'వరల్డ్ బిజీయెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఫర్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్' టైటిల్‌ని ఇంకోసారి నిలబెట్టుకుంది. 7.2 శాతం వృద్ధితో, 83.6 మిలియన్ ప్రయాణీకులతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మరోసారి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 2015లో ఈ సంఖ్య 78 మిలియన్లుగా ఉంది. 2017 నాటికి 89 మిలియన్ ప్యాసింజర్లను లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఏడాదికి 90 మిలియన్ల మందికి సేవలందించేలా ఎప్పటికప్పుడు సరికొత్తగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇంటర్నేషనల్ హబ్‌కి సంబంధించి 260 డెస్టినేషన్స్‌కి 100కి పైగా ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసుల్ని నడుపుతున్నాయి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి. ఇంకో వైపున దుబాయ్‌కి చెందిన రెండవ ఎయిర్‌పోర్ట్ అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ 2013లో ప్రారంభం కాగా, పూర్తిస్థాయిలో ఆపరేషనల్ మోడ్‌లోకి వస్తే ఏడాదికి 120 మిలియన్ ప్యాసింజర్లకు సేవలు అందించగలదు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







