ప్రత్యేక హోదాకు మహేష్ బాబు ఎందుకు మద్దతు పలకటం లేదని ప్రశ్నించాడు...
- January 26, 2017
తన ట్వీట్ లతో ఎప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మ ఈ సారి టార్గెట్ మార్చాడు. ప్రత్యేక హోదా కోసం పవన్ వరుస ట్వీట్ లు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమానికి మహేష్ బాబు ఎందుకు మద్దతు పలకటం లేదని ప్రశ్నించాడు. తమిళ సాంప్రదాయం కోసం ట్వీట్ చేసిన మహేష్, తన సొంతం ప్రాంతమైన ఆంధ్రుల పోరాటానికి ఎందుకు మద్దతివ్వలేదన్నాడు.
'మహేష్ బాబు తమిళ పండుగకు మద్దతిచ్చి ఆంధ్రుల జీవన పోరాటానికి ఎందుకు మద్దతివ్వటం లేదు..? అంటే అతనికి రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్ కు ఉన్నంత బాధ్యత లేదా..? మహేష్ డబ్బింగ్ మార్కెట్ కోసం బాదపడ్డంత, అతన్ని సూపర్ స్టార్ ని చేసిన అసలు మార్కెట్ కోసం బాదపడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పవన్ పోరాటంతో కలిసిరాని సెలబ్రిటీలు ద్రోహులుగా మిగిలిపోతారు.
మహేష్ అభిమానులు ఆయనకు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపమని చెప్పకపోతే వారు కూడా ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర సమస్యల కన్నా పవన్ గురంచి ఎక్కువగా కంగారు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటే జల్లికట్టుకు ఎందుకు సపోర్ట్ చేసినట్టు, పవన్ కు ఎందుకు సపోర్ట్ చేయనట్టు..?' అంటూ తనదైన స్టైల్ లో ప్రశ్చించాడు వర్మ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







