తొమ్మిది చిత్రాల నిర్మాణం...
- January 27, 2017
తిరుపతి: కొద్దికాలంగా ఫాం కోల్పోయిన స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ తిరిగి పుంజుకునేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. 2017,2018 సంవత్సరాల్లో ఏకకాలంలో ఏకంగా తొమ్మిది చిత్రాలు నిర్మించనున్నట్లు దత్ వెల్లడించారు. శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, నాని వంటి హీరోలతో భారీ సినిమాలు తీయనున్నట్లు అశ్వినీ దత్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవితో అశ్వనీదత్ మరుపురాని ఎన్నో హిట్ సినిమాలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత 'ఖైదీ నంబర్ 150'తో చిరు రీ ఎంట్రీ ఇవ్వడం, ఇక ముందు కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్ 151వ సినిమా ఎవరితో చేస్తారు?
అనే చర్చ మొదలైంది. ఖైదీ నిర్మాత రాంచరణే చిరు 151వ సినిమానూ నిర్మిస్తారని, ఆ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహిస్తారని తెలిసింది. అశ్వనీ దత్ ప్రణాలిక అమలైతే గనుక వైజయంతి బ్యానర్‌లోనే చిరు 152వ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







