బాలికను లైంగికంగా వేధించిన పని మనిషికి ఐదేళ్ల జైలుశిక్ష

- January 28, 2017 , by Maagulf
బాలికను  లైంగికంగా వేధించిన పని మనిషికి ఐదేళ్ల జైలుశిక్ష

మనామా: ఉపాధి కోసం వచ్చిన పనిమనిషి పాడుపనులు మొదలుపెట్టింది. కామంతో రగిలిపోతూ ప్రకృతికి విరుద్ధంగా ఓ  చిన్నారిపై పలుమార్లు అఘాయిత్యాలు జరిపింది. విదేశీ మహిళా పనిమనిషి తాను శ్రద్ధ వహించడానికి అప్పగించబడిన ఒక బాలికను బాధ్యతగా చూడాల్సిందిపోయి  లైంగికంగా వేధించెంది. ఒక రోజు పామ పండటంతో ఆ నేరానికి  పని మనిషికి ఐదు సంవత్సరాల జైలుశిక్షను కోర్టు విధించింది. ఆ మహిళ ఐదుఏళ్ల వయస్సు గల్ ఆ బాలికను శారీరకంగా లైంగిక వేధింపులకు గురిచేయడమే కాక " ఆ విషయం గురించి ఎవరికైన చెబితే, బాలిక నాలుకను కత్తిరిస్తానని బెదిరించేది.".పనిమనిషి ఆ బాలికతో అశ్లీల చేష్టలు 15 తడవలు కన్నా ఎక్కువసార్లు చేయించుకోవడమే కాక  ఆ బాలికను  లైంగికంగా పలుమార్లు వేధించినట్లు న్యాయమూర్తులు ముందు అంగీకరించింది.ఆమె మొదట ప్రజా ప్రాసిక్యూషన్ విచారణ లో ఆమెపై మోపబడిన ఆరోపణలు తిరస్కరించిన తరువాత మెయిడ్ అంగీకారానికి వచ్చారు. గత సంవత్సరం జూలై నెలలో బాలిక తండ్రి ఇంట్లో పని చేసే పనిమనిషిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు  చేశాడు. దీనికి తోడు ఆ బాలిక  అత్త ఆ ఒకసారి కంటే ఎక్కువ సార్లు తన మేనకోడలను పనిమనిషి లైంగికంగా లొంగదీసుకుని తన  కోర్కెలు తీర్చుకోవడం కళ్లారా చూసినట్లు కోర్టుకి తెలియజేశారు.14 ఏళ్ల లోపు పిల్లలపై లైంగిక దాడి చేసిన నేరంలో పనిమనిషి జరపడంపై   ఐదవ హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com