'యుంగ్ ముంగ్ సుంగ్' అనే టైటిల్‌తో ప్రభుదేవా...

- January 29, 2017 , by Maagulf
'యుంగ్ ముంగ్ సుంగ్' అనే టైటిల్‌తో ప్రభుదేవా...

ప్రముఖ దర్శకుడు, నటుడు, కొరియో గ్రాఫర్ ప్రభుదేవా ఇటీవల దేవి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికి వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇక తాజాగానూతన దర్శకుడు అర్జున్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు ప్రభుదేవా. ఈ సినిమా, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాకు
'యుంగ్ ముంగ్ సుంగ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోండగా ఇందులో కథానాయికగా ఘాటు ఎంఎల్ఏ కేథరిన్ థెస్రా నటించనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయాలని భావిస్తోండగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com