నేటితో యూ.ఏ.ఈ. లో మధ్యాహ్న విరామ నిబంధన సరి
- September 15, 2015
యూ. ఏ. ఈ. లో కార్మిక మంత్రి శ్రీ సక్ర్ ఘోబష్ ఆదేశాల మేరకు కాల్చివేసే ఎండల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికై జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12 30 నుండి 3 00 గంటల మధ్య పనిచేయడాన్ని నిషేధిస్తూ, అధిక పనిగంటలలో పనిచేయించడం శిక్షా ర్హo అని విధించిన ‘మధ్యాహ్న విరామ నిబంధన’ నిబంధన నేటితో సరి అని కార్మిక శాఖ తెలిపింది. గత 11 సంవత్సరాల నుండి1980 వ సంవత్సరపు ఫెడరల్ లా నెంబరు 8 ప్రకారం ఈ నిబంధన ఆమలౌ తూ వస్తోంది.ఐతే, ఆఖరి నిముషం వరకు పర్యవేక్షణ బృందాలు, అన్ని కంపెనీలు ఈ నిబంధన పాటిస్తున్నాయా లేదా అని నిరంతరం పహారా కాస్తునే ఉన్నాయి. పై నిబంధన పాటించినందుకు, కార్మికులకు ఉచిత ఆరోగ్య తనిఖీలు, ఆత్మ రక్షణ విధానలలో శిక్షణ ఇవ్వడం వంటి సంరక్షణ చర్యలు చేపట్టినందుకు అన్ని ప్రభుత్వ మరీయు ప్రైవేటు కంపెనీల వారికి, మరియు కార్మికులకు చల్లని నీరు మరియు పళ్ళ రసాలు ఇచ్చి దయతో సహకరించిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







