ఈ నెల 18న లో 'తెలంగాణా ప్రజా సమితి-ఖతార్' వారి తొలి సమావేశం
- September 15, 2015
తెలంగాణా ప్రజా సమితి ఖతార్ కార్యవర్గం కృషి మరియు ఖతార్ లో ఉన్న తెలంగాణా సోదరుల ప్రోత్సాహం, సహాయ సహకారాలతో భారత దౌత్య కార్యాలయము ఖతార్ నిబందనలకు మరియు ఖతార్ సంబంధిత చట్టాలకు లోబడి సాంస్కృతిక సంస్థ (Indian Cultural Center-ICC, Doha, Qatar) తో అనుసంధానం ఆమోదింపబడినది. తెలంగాణా ప్రజా సమితి ఖతార్ లక్ష్యాలను చేదిన్చుటకు కార్యవర్గ బృందాన్ని విస్తరించడం జరిగింది. ఇందుకు తెలంగాణా ప్రజా సమితి ఖతార్ గౌరవ సభ్యులు మరియు ఖతార్ లో నివసిస్తున్న తెలంగాణా సోదర సోదరీమనులందరికి ఒక పరిచయ వేదిక ఏర్పాటు చెయ్యబడినది. దీనితో ఖతార్ లోని తెలంగాణా ప్రజా సమితి ఖతార్ ఐకమత్యాన్ని చాటి అందరికి తెలంగాణా ప్రజా సమితి ఖతార్ యొక్క విధి విధానాలు, నియమ నిబందనలు, లక్ష్యాలు, నూతన కార్యవర్గ ప్రకటన ప్రమాణ స్వీకారము, ఇంతవరకు చేసిన కార్యక్రమాల వివరాలు, సభ్యత్వ నమోదు మరియు భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలు చర్చించడం జరుగుతుంది.
ఇది తెలంగాణా ప్రజా సమితి ఖతార్ భారత దౌత్య కార్యాలయం అనుమతి పొందిన తర్వాత మొట్టమొదటి అధికారిక సమావేశము. కావున ఖతార్ లో నివసిస్తున్న తెలంగాణా ప్రవసీలందరూ ఈ సమావేశం లో పాల్గొని వారి విలువయిన సలహాలు సూచనలు అందించి సంస్థ అభివృద్ధికి తోడ్పదగాలరని మనవి.
తేది:18-09-2015
సమయం:సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు.
స్థలం: రొతాన హోటల్, బ్యాన్కేట్ హాల్, స్ట్రీట్ నెంబర్ 27, అల వతన్ పెట్రోల్ స్టేషన్ వెనక, ఇండస్ట్రియల్ ఏరియా, దోహా, ఖతార్.
సంప్రదించవలసిన నెంబర్లు:33267724, 70231434, 66902015,66844553, 30177903, 77212911
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









