షియా మసీదు బాంబుపేలుడు సంఘటనలో ఏడుగురికి నేడు మరణశిక్ష విధించిన కువైట్ న్యాయస్థానం
- September 15, 2015
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ వారిచే జరుపబడిన షియా మసీదు బాంబుదాడి కేసులో నిందితులను దోషులుగా గుర్తించిన కువేట్ న్యాయస్థానం, వారికి మరణ శిక్ష విధించింది.26 మంది షియా మతస్తుల మృతికి, 227 మంది గాయపడడానికి కారణమైన జూన్ 26 సౌదీ ఆత్మాహుతి బాంబుదాడి ఆత్మాహుతి తీవ్రవాది కి సహాయపడినట్లు నిరూపించబడిన 7గురు మహిళలతో సహా 29 మంది నిందుతులపై నేడు విచారణ జరిగింది. తన భావజాలాన్ని అమళుజరపడానికి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న తీవ్రవాదం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను గురించి న్యాయమూర్తి మొహమ్మద్ అల్-దువైజ్, కిక్కిరిసిన న్యాయస్థానంలో తన తీర్పు ఇవ్వబోయెముందు ప్రస్తావించారు.
మరణ శిక్షకు గురైన వారిలో ఇద్దరు అబ్దుల్ రహ్మాన్ సాబా సౌడ్ ద్, ఫాహాద్ ఫర్రాజ్ మూహారెబ్ కాగా, దాడికి అవసరమైన ఆయుధాలను ఐస్-బాక్స్ లో ఉంచి సరఫరా చేసిన మొహమ్మద్ మరియు మజేద్ అల్-జాహ్రానీ అనే ఇద్దరు సౌదీ సోదరులతో సహా ఐదుగురు పరారీలో ఉన్నారు. మిగిలిన 15 మందిలో ఐదుగురు మహిళలతో సహా మొత్తం 8 మందికి సాయుధ శిక్షణ ఇచ్చినందుకు 2 నుండి 8 సంవత్సరాల కారాగారవాస శిక్ష విధించింది. ఇద్దరు మహిళలతో సహా, మిగిలిన 14 మందిని నిరపరధులుగా భావిస్తూ విడిచిపెట్టింది. విచారణ జరుగుతున్న సిటీ కోర్ట్ కాంప్లెక్స్ బయట సాయుధ వాహనాలు మోహరించగా, ఉపరితలం పై హెలికాప్టర్లు పహారాతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయబడ్డాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









