గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణం...
- January 31, 2017
హైపర్‌లూప్ సంస్థ ఛైర్మన్ బిబోప్ జి.గ్రెస్తా
అమరావతి: తమ సంస్థ ఆధ్వర్యంలో బుల్లెట్ రైలును మించిన వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థను తీసుకొస్తామని హైపర్‌లూప్ సంస్థ ఛైర్మన్ బిబోప్ జి.గ్రెస్తా వెల్లడించారు. గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణించేలా తమ పరిజ్ఞానం ఉంటుందని చెప్పారు. విద్యుత్ అయస్కాంత శక్తితో ఒక ట్యూబ్ లోపల పాడ్స్, క్యాప్సూల్స్ లాంటివి అమరుస్తామని, పిల్లర్లు నిర్మించి దానిపై ప్రీఫ్యాబ్ స్టీల్ ట్యూబ్‌లు వేస్తామని, ఒక్కో క్యాప్సూల్‌లో 40 మంది వరకూ ప్రయాణించేలా అవకాశం ఉంటుందని వివరించారు.
వేగం ఎక్కువైనా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భయం ఉండబోదన్నారు. ఒక కి.మీ.కు 40 మిలియన్ డాలర్ల వ్యయమవుతుందని అంచనా వేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంగళవారం సాయంత్రం ఆయన బృందం భేటీ అయింది. తొలుత ఈ రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ఆయన విలేకర్లతో మాట్లాడారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







