మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ...
- February 01, 2017
అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్ మెన్" లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు. కె.సి.నరసింహారావు నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో "అంతకు ముందు ఆ తర్వాత" ఫేమ్ ఈష, అదితి మ్యానికల్ కథానాయికలుగా నటించనుండగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు (ఫిబ్రవరి 1) జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ కొట్టగా.. వినయ్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "నేడు పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్ షూట్ కూడా మొదలుపెట్టనున్నాం. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ లు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈష, అదితి మ్యానికల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ గారు సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రానికి పి.జి.విందా కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు" అన్నారు.
తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







