స్వల్పంగా పెరిగిన బంగారం ధర...
- February 01, 2017
ముంబయి: ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.29,750కి చేరింది. బంగారం ధర గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉంది. జనవరి 28 నుంచి పది గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగి కేజీ వెండి ధర రూ.42వేల మార్కును దాటిపోయింది. ఈరోజు కేజీ వెండి రూ. 300 పెరిగి రూ.42,200కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్ మార్కెట్లో ఈరోజు ఔన్సు బంగారం ధర 0.59శాతం పెరిగి 1,208.50 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







