జనవరి 26 ఘటనలపై విచారణ ప్రారంభం
- February 02, 2017
మనామా: టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీప్ ప్రాసిక్యూటర్ ఇసా అల్ రువైయి మాట్లాడుతూ, జనవరి 26న జరిగిన ఘటనలపై విచారణ ప్రారంభమయ్యిందన్నారు. ఈ ఘటనలో టెర్రిస్టు గ్రూపుకు చెందిన కొందరు దుండగులు, సెక్యూరిటీ సిబ్బందిని అలాగే వాహనాల్ని టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ ఘటనలో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసింది. నిందితులు నేరానికి పాల్పడిన వైనం గురించి, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వివరాలు అందించింది. అరెస్టయిన నిందితులు తాము ఓ తీవ్రవాద సంస్థలో చేరి, శిక్షణ పొందామని, దాడులకు దిగామని విచారణలో ఒప్పుకున్నట్లు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. తనిఖీల్లో భాగంగా ఎన్‌ఎస్‌ఎ, నిందితుల నుంచి పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకుంది. నిందితులంతా కలిసి కొత్తగా ఓ తీవ్రవాద గ్రూపుని ఏర్పాటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







