నారా చంద్రబాబు తనయుడు లోకేశ్ ఫ్యూచరేంటి..
- February 02, 2017
నారా చంద్రబాబు తనయుడు లోకేశ్ ఫ్యూచరేంటి.. ఆయనకు ఏ పదవి అప్పగిస్తారు.. పార్టీ పదవులతో సరిపెడతారా.. లేక అధికారం అప్పగించే మంత్రి పదవి కట్టబెడతారా.. మంత్రిని చేస్తే ఇంకెప్పుడు చేస్తారు.. ఆల్రెడీ సగం పాలనాకాలం అయ్యాక మంత్రిపదవి ఇచ్చే అవకాశం ఉంటుందా.. ఇలాంటి ఎన్నో సందేహాలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు.
ఇన్నాళ్లూ ఈ అంశంపై ఊహాగానాలకే వదిలేసిన చంద్రబాబు మొట్టమొదటిసారిగా లోకేశ్ ఫ్యూచర్ పై క్లారిటీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన భేటీలో తన మనసులోని మాటను బయటపెట్టేశారు. ఇప్పుడు లోకేశ్ మంత్రి కావాలంటే్ ఆయన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం ఒక్కటే మార్గం.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రి పదవి ఇవ్వడానికి రాజ్యాంగపరంగా అడ్డంకులేమీ లేవు..
కానీ ఆరునెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ తలనొప్పంతా ఎందుకని భావిస్తున్న సీఎం త్వరలోనే లోకేశ్ ను ఎమ్మెల్సీని చేసి.. ఆ తర్వాత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసేసుకుంటారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నేతలకు చెప్పారట.
సాధారణంగా లోకేశ్ వంటి నేత అసెంబ్లీ ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయితేనే ఆయన రాజకీయ పునాది గట్టిగా ఉంటుంది. పరోక్ష పదవుల ద్వారా మంత్రిపదవి ఇవ్వడం అంతగా బావుండకపోయినా.. ప్రస్తుతం చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడేలా కనిపిస్తున్నారు. లోకేశ్ కోసం రాజీనామాలకు నేను సిద్ధం అంటూ కొందరు ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నా.. అనవసరంగా ఉప ఎన్నికలెందుకన్న ఆలోచన చంద్రబాబుకు ఉన్నట్టుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







