భారత్ ఘన విజయం అంధుల టీ20 వరల్డ్ కప్‌లో...
- February 03, 2017
హైదరాబాద్: అంధుల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మరో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఎడ్వర్డ్ 34 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులతో రాణించగా, జస్టిన్ (24), ల్యూక్ జాసన్ (16) పరుగులతో ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లు వరస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెంచారు. భారత బౌలర్లలో కేతన్ పటేల్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం 159 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది.
ఓపెనర్లు సుక్‌రామ్ 32 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ గణేశ్ 34 బంతుల్లో 15 ఫోర్లతో 78 నాటౌట్ చెలరేగారు.
మరో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించగా, ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై, నేపాల్ 3 పరుగులతో దక్షిణాఫ్రికాపై, బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







