మిరపకాయలు తింటే ఆయుష్షు పెరుగుతుందట.. ఒబిసిటీని కూడా తగ్గించుకోవచ్చట...
- February 03, 2017
మిరపకాయలు తింటే ఆయుష్షును పెంచుకోవచ్చునని తాజా అధ్యయనాలు తేల్చాయి. కారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా అధికబరువు సమస్య నుంచి కొంతవరూ తప్పించుకోవచ్చునని పరిశోధనలు తేల్చాయి. తాజాగా అమెరికాలో నిర్వహించిన పరిశోధనల్లో పండు మిరపకాయలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు.
అమెరికాలో 16వేల మంది మీద సుమారు 23 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. ఈ కాలంలో వారి ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య స్థితిని గమనించారు. పండుమిరపకాయలు ఎక్కువగా తినే వారిలో తక్కువ ఆరోగ్య సమస్యలు కనిపించగా, తక్కువ తీసుకునే వారిలో గుండెపోటు వంటి సమస్యలను గుర్తించారు. కారం ఎక్కువ తినడం వలనే దీర్ఘాయుష్షు సాధ్యమన్న విషయాన్ని వీరు స్పష్టం చేయకపోయినా, కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పరిశోధకులు తెలిపారు.
మిరపకాయలోని క్యాప్సైసిన్, డీహైడ్రోక్యాప్సైసిన్‌లుండటం వలన బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచి ధమనుల గోడలలో పేరుకుపోయి ఉన్న కొవ్వును ఇది తొలగిస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టి ఉంటే కూడా దానిని నివారించేందుకు మిరపకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







