బీజేపీలోకి ఎస్ఎం కృష్ణ!...
- February 04, 2017
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ త్వరలో బీజీపీలో చేరనున్నట్టు కర్నాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పడు చేరతారన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది. అయితే ఆయన మా పార్టీలో చేరడం మాత్రం 100 శాతం ఖాయం'' అని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన 84 ఏళ్ల ఎస్ఎం కృష్ణ... గతవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ పదవికి, పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు అత్యంత విధేయుడిగా పనిచేస్తున్నప్పటికీ.
తన వయసురీత్యా పార్టీ కార్యకలాపాల నుంచి పక్కనబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలో తనకు ప్రాముఖ్యత కూడా కరవైందని... కాంగ్రెస్‌కు మేనేజ్ చేసేవాళ్లు తప్ప ప్రజాదరణ కలిగిన నేతలు అవసరం లేదని విమర్శించారు. ఎస్ఎంను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ''అదో ముగిసిన అధ్యాయం'' అంటూ ఆయన కుండబద్దలు కొట్టేశారు.
త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో... ఆయన చేరిక బీజేపీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







