వలసదారుల జీవనంపై ఐసిసి సెమినార్‌

- February 04, 2017 , by Maagulf
వలసదారుల జీవనంపై ఐసిసి సెమినార్‌

మనామా:'లాయల్టీ టు బహ్రెయిన్‌ : ది ఎక్స్‌పీరియన్స్‌ ఆఫ్‌ ఎక్స్‌పాట్రియేట్స్‌' పేరుతో బహ్రెయిన్‌లో ఫిబ్రవరి 13న ఇసా కల్చరల్‌ సెంటర్‌ (ఐసిసి) సెమినార్‌ నిర్వహించనుంది. అహ్మద్‌ అల్‌ ఫతెహా మాస్క్‌ - జుఫైర్‌లోని క్యాంపస్‌లో ఈ సెమినార్‌ జరుగుతుంది. కింగ్‌డమ్‌లోని వలసదారులంతా ఈ సెమినార్‌కి ఆహ్వానితులే. నేషనల్‌ యాక్షన్‌ చార్టర్‌ 16వ యానివర్సరీ సందర్భంగా ఐసిసి ఈ సెమినార్‌ని ఏర్పాటు చేసింది. బహ్రెయిన్‌ పౌరుల కోసం ఏర్పాటు చేయబడిన నేషనల్‌ యాక్షన్‌ ఛార్టర్‌ ఏర్పాటు చేయబడింది. వలసదారులకు అత్యంత అనుకూలమైన బహ్రెయిన్‌, అరబ్‌ దేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. వలసదారుల జీవనానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడంలో బహ్రెయిన్‌ మిగతా దేశాలకన్నా ముందుంటోంది. అలాగే బహ్రెయిన్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వలసదారుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో చొరవ చూపుతున్నాయి. సెమినార్‌ విషయానికొస్తే, ఈ సెమినార్‌లో వలసదారులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ప్రభుత్వం నుంచి, అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి వారెలాంటి సహాయ సహకారాలు ఆశిస్తున్నారు? బహ్రెయిన్‌ సమాజంలో వారి పాత్ర ఏంటి? ఇలాంటి అంశాలపై చర్చించడంతోపాటు వలసదారుల అభిప్రాయాల్ని తెలుసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com