వలసదారుల జీవనంపై ఐసిసి సెమినార్
- February 04, 2017
మనామా:'లాయల్టీ టు బహ్రెయిన్ : ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్‌పాట్రియేట్స్' పేరుతో బహ్రెయిన్‌లో ఫిబ్రవరి 13న ఇసా కల్చరల్ సెంటర్ (ఐసిసి) సెమినార్ నిర్వహించనుంది. అహ్మద్ అల్ ఫతెహా మాస్క్ - జుఫైర్లోని క్యాంపస్‌లో ఈ సెమినార్ జరుగుతుంది. కింగ్‌డమ్‌లోని వలసదారులంతా ఈ సెమినార్‌కి ఆహ్వానితులే. నేషనల్ యాక్షన్ చార్టర్ 16వ యానివర్సరీ సందర్భంగా ఐసిసి ఈ సెమినార్ని ఏర్పాటు చేసింది. బహ్రెయిన్ పౌరుల కోసం ఏర్పాటు చేయబడిన నేషనల్ యాక్షన్ ఛార్టర్ ఏర్పాటు చేయబడింది. వలసదారులకు అత్యంత అనుకూలమైన బహ్రెయిన్, అరబ్ దేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. వలసదారుల జీవనానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడంలో బహ్రెయిన్ మిగతా దేశాలకన్నా ముందుంటోంది. అలాగే బహ్రెయిన్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వలసదారుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో చొరవ చూపుతున్నాయి. సెమినార్ విషయానికొస్తే, ఈ సెమినార్లో వలసదారులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ప్రభుత్వం నుంచి, అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి వారెలాంటి సహాయ సహకారాలు ఆశిస్తున్నారు? బహ్రెయిన్ సమాజంలో వారి పాత్ర ఏంటి? ఇలాంటి అంశాలపై చర్చించడంతోపాటు వలసదారుల అభిప్రాయాల్ని తెలుసుకుంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







