'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్' ఆడియో రిలీజ్!...
- February 06, 2017
శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రిమ్మలపూడి వీరగంగాధర్ నిర్మిస్తున్న చిత్రం `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్`. రవిచంద్ర కన్నికంటి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అర్జున్ మహి, అశ్విని జంటగా నటిస్తున్నారు. సుమన్ జూపూడి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రేలంగి నరసింహారావు, వీరశంకర్, దేవిప్రసాద్, సాయివెంకట్, సీడీలను ఆవిష్కరించారు.
"సినిమా టైటిల్ చాలా ట్రెండీగా ఉంది. పాటలు, ట్రైలర్స్ కూడా యువతను ఆకట్టునే విధంగా ఉన్నాయి. దర్శకుడిలోని ప్రతిభ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ అందరికీ మంచి పేరు రావాలన్నారు.
దర్శకుడు రవిచంద్ర కన్నికంటి మాట్లాడుతూ..."ఇదొక లవ్లీ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. టైటిల్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమన్ జూపూడి గారు అద్భుతమైన పాటలిచ్చారు. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. మా ఆడియోతో పాటు సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా" అన్నారు.
నిర్మాత వీరగంగాధర్ రిమ్మలపూడి మాట్లాడుతూ..."దర్శకుడు రవిచంద్ర చెప్పిన దానికంటే కూడా సినిమాను చాలా బాగా చిత్రీకరించారు. అర్జున్ మహి, అశ్విని జంట బాగుందంటున్నారు. ఆడియో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మా తొలి ప్రయత్నాన్ని ఆడియన్స్ ఆదరించాలని కోరకుంటున్నా" అన్నారు.
హీరో హీరోయిన్స్ మాట్లాడుతూ..."ఒక మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుమన్ జూపూడి గారి పాటలు అందర్నీ అలరిస్తాయన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
థర్టీ ఇయర్స్ పృథ్వీ, జబర్దస్త్ అప్పారావు, కేదార్ శంకర్ .యం, నిర్మల, రింగ్ రమేష్, గంగాధర్, రితిక, రాధ, ఉమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః వాసు బొజ్జా, సంగీతం: సుమన్ జూపూడి, కొరియెగ్రఫీః నరేశ్ ఆనంద్, పాటలుః ధీరేంద్ర, ఈమని, ఎడిటర్ః రవీంద్రబాబు.కె, నిర్మాతః వీరగంగాధర్ రిమ్మలపూడి, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: రవిచంద్ర కన్నికంటి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







