తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది..
- February 06, 2017
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది. సోమవారం ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలతో పాటు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరపనున్నారు. .
ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఫిబ్రవరి 20 కాగా, ఫిబ్రవరి 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువును ఫిబ్రవరి 23గా నిర్ణయించారు. అయితే, మార్చి 9న ఇరు రాష్ట్రాల్లోని ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







